క్రైమ్/లీగల్

వార్డు అభ్యర్థిపై దాడి: ఇద్దరిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 22: వార్డు అభ్యర్థిగా పోటీలో వున్న వ్యక్తిపై దాడి జరిగిన సంఘటన వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో జరిగింది. బాధితుడు బేగరి జనార్ధన్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నర్సింలు, శ్రీనివాస్‌లు తనపై దాడి చేసి కొట్టారని తెలిపారు. గత 15 రోజులుగా పోటీలో ఉన్న మాజీ సర్పంచ్ గురువారెడ్డి భార్యకు మద్దతివ్వాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పాడు. జనార్ధన్‌పై దాడి చేసి కొట్టిన నర్సింలు, శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ సీతయ్య తెలిపారు.