క్రైమ్/లీగల్

బార్ కౌన్సిల్ ఎన్నికలపై పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణపై కౌంటర్ దాఖలు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ విభజన పూర్తి కాకుండానే రెండు తెలుగు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఎన్నికలను నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు శారదా గౌడ్, నరసింహులు, సౌభాగ్యరాజు విడివిడిగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లును మంగళవారం జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ నవీన్ సిన్హా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎన్.కె.మోదీ, చంద్రభూషణ్, ఆర్.కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ అడ్వకేట్ చట్టంలోని సెక్షన్-4లో తెలంగాణ పదాన్ని చేర్చకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని ధర్మాసనానికి వివరించారు. తెలంగాణ హైకోర్టు విభజన జరగకుండానే గత ఏడాది జూన్‌లో తెలంగాణ బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తు నాలుగు వారాలకు విచారణను వాయిదా వేసింది.