క్రైమ్/లీగల్

నిందితుల వాంగ్మూలాల ఫొటో కాపీలను ఆధారంగా తీసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 23: మాలేగావ్ పేలుళ్లకేసులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ కోర్టు సాక్షులు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకటనల ఫోటో కాపీ ప్రతులను సెకండరీ ఈవిడెన్స్‌గా తీసుకోరాదని ముంబయి హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఏఎస్ ఓకా, ఎఎస్ గడ్కరీతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫొటో కాపీలను ఎన్‌ఐఏ సమర్పించిందని కోర్టు పేర్కొంది. కాగా ఈ ఫొటో కాపీలు ఒరిజనల్ ఈవిడెన్స్ డాక్యుమెంట్లకు సంబంధించినవా కాదా అనే విషయాన్న ఎన్‌ఐఏ ప్రస్తావించలేదని కోర్టు పేర్కొంది. ఒరిజనల్ డాక్యుమెంట్లు గల్లంతు కావడంతో ఫొటోకాపీలను ఉపయోగించడానికి ఎన్‌ఏఏ 2017 జనవరిలో అనుమతించింది. ఈ వాంగ్మూలాలను సీఆర్‌పీసీ 164 కింద ఎన్‌ఏఏ నమోదు చేసింది. ఈ ఫైళ్లు గల్లంతయ్యాయి. ఇంతవరకు లభించలేదు. ఈ ఫైళ్లు గల్లంతైనందు వల్ల, కేసు విచారణకు కాను ఒరిజనల్ డాక్యుమెంట్ల నకళ్లను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌ఐఏ కోర్టును ఎన్‌ఐఏ అధికారులు కోరారు. అనంతరం కోర్టు ఫొటో కాపీలను సెకండరీ ఈవిడెన్స్‌గా పరిగణించేందుకు అంగీకరించింది. కాగా, ఎన్‌ఏఏ కోర్టు ఈ డాక్యుమెంట్లకు అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ మాలేగావ్ కేసులో నిందితుడు సమీర్ కులకర్ణి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసుపై వచ్చే నెల 5వ తేదీన విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. ముంబయికి 200 కి.మీ దూరంలో మాలేగాం పట్టణంలో 2008 సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన పేలుళ్లలో అనేక మంది మరణించారు. ఈ కేసులో నిందితులుగా సాద్వీ ప్రయాగ సింగ్ టాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ తదితరులు ఉన్నారు.