క్రైమ్/లీగల్

తడ వద్ద రూ.6.52 కోట్లు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 23: రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నెల్లూరు జిల్లా తడ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 6.52 కోట్ల దేశీయ, విదేశీ కరెన్సీ ఉన్న నగదును తడ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుండి చెన్నైకు నగదు తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో తడ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో నరసాపురం నుండి చెన్నై వైపు వెళుతున్న ఏపి 37 సికె 8280 మారుతీ కారుని నిలిపి వివరాలు అడిగే సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అనుమానంతో కారును క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులకు కారులో బస్తాలు కనిపించాయి. వీటిని తెరచి చూడగా నోట్ల కట్టలు బయటపడడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. నిందితులను విచారించగా తాము నరసాపురం జైదేవ్ జ్యూయలర్స్ నుండి వస్తున్నామని, తమ యజమాని ప్రవీణ్‌కుమార్ జైన్ ఆదేశాల మేరకు చెన్నై తీసుకెళుతున్నట్లు తెలిపారు. వీటిలో ఒమన్, కువైట్, అమెరికా దేశాలకు చెందిన సుమారు రూ.19 లక్షల విలువ చేసే కరెన్సీతో పాటు 55 గ్రాముల బంగారు బిస్కెట్ కూడా ఉండడం గమనార్హం. ఈ నగదుకు సంబంధించి ఎటువంటి బిల్లులు కానీ, సమాచారం కానీ వారి వద్ద లేకపోవడంతో విచారణ నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకొని ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన తడ ఎస్సై వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బందిని అభినందించిన ఎస్పీ వారికి రివార్డులు అందచేశారు.

చిత్రం..విలేఖర్ల సమావేశంలో తడ వద్ద పట్టుకున్న నగదును చూపి మాట్లాడుతున్న ఎస్పీ ఐశ్వర్య రస్తోగి