క్రైమ్/లీగల్

మరో మల్టీలెవల్ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం బట్టబయలైంది. గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ పేరుతో చేస్తున్న మోసం ఆలస్యంగా వెలుగుచూసింది. లక్ష ఇస్తే నాలుగు క్వింటాళ్ల పల్లీలు, యంత్రం ఇస్తూ తయారుచేసిన నూనె ఇస్తే నెలకు 20వేలు ఇస్తామని అమాయకులను నమ్మించి..కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన ఉప్పల్ పోలీసులు బుధవారం బయోటెక్ సంస్థపై దాడులు నిర్వహించారు.
చీటర్ జిన్నా శ్రీకాంత్, మేనేజర్ భాస్కర్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ పీ.వెంకటేశ్వర్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన జిన్నా శ్రీకాంత్ విశ్వ నగరాన్ని అడ్డాగా చేసుకుని మల్టీలెవల్ మార్కెటింగ్ (గొలుసుకట్టు) వ్యాపారం చేస్తూ ఎందరో అమాయకులను మోసం చేసి సీసీ పోలీసులకు చిక్కి కటకటపాలయ్యాడు. గోల్డ్ పేరుతో ఎన్నో వ్యాపారులు చేసి కోట్లకు పడగలెత్తిన ఇతడు ఉప్పల్ లక్ష్మారెడ్డి కాలనీలోని మాస్టర్ చెఫ్ పక్కన 8 నెలల క్రితం గ్రీన్ హోల్డ్ బయోటెక్ పేరుతో సంస్థను ప్రారంభించాడు. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.20వేలు ఇస్తామంటూ డబ్బులు తీసుకుని 4క్వింటాళ్ల పల్లీలు, తయారుచేసే యంత్రం ఇస్తున్నాడు. తద్వారా తయారుచేసిన నూనె తీసుకుని నమ్మించేందుకు రెండు నెలలు 20వేలు ఇస్తున్నాడు. ఈ వ్యాపారానికి ఆశపడిన ఎందరో ముందుకు వచ్చి డబ్బులు ఇస్తున్నారు. నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి నెల నెలా తయారుచేసిన పల్లి నూనెకు ఒప్పందం ప్రకారం ఇచ్చే డబ్బులు ఇవ్వడం అకస్మాత్తుగా మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు గ్రీన్‌హోల్డ్ బయోటెక్ సంస్థపై దాడి చేశారు. అక్కడ ఉన్న వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాధితుల్లో ఒకరైన సరూర్‌నగర్‌కు చెందిన ఇంద్ర కరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటర్ శ్రీకాంత్, సంస్థ మేనేజర్ భాస్కర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.