క్రైమ్/లీగల్

చినగుడబలో వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుగుబిల్లి, జనవరి 24: మండల పరిధిలోని చినగుడబ గ్రామానికి చెందిన ఎన్ కృష్ణమూర్తినాయుడు(38) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ వై సింహాచలం గురువారం తెలిపారు. ఈమేరకు గ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే భార్యభర్తలిద్దరూ గతంలో తగదాలు పడటంతో ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందన్నారు. అయితే గతంలో బ్యాంకులో రుణం తీసుకున్న సమయంలో మృతుడు నుంచి ఒక వ్యక్తి అప్పుగా తీసుకున్న సొమ్ము నేటి వరకు చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడన్నారు. అంతేకాకుండా పార్వతీపురానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెను ఇచ్చి పెళ్లిచేస్తానని చెప్పి ఇటీవల నీవు మా ఇంటికి రావద్దని మనుషులను పెట్టి కొట్టించిందన్నారు. మృతుడి షర్ట్‌లో ఉన్న సూసైడ్‌ను పోలీసులు తీసుకున్నారు. మృతుడి తండ్రి రామినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈమేరకు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు.