క్రైమ్/లీగల్

ప్రత్యేక హోదా సాధనకై వైకాపా నేతలపై పెట్టిన కేసులు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జనవరి 24: ప్రత్యేక హోదా సాధనకై రేణిగుంట రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో చేసిన వైకాపా నాయకులపై పెట్టిన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసింది. గురువారం నెల్లూరు రైల్వేకోర్టులో 10 మంది వైకాపా నాయకులపై పెట్టిన కేసును న్యాయమూర్తి కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. 2018 ఏప్రిల్ నెలలో రేణిగుంట రైల్వేస్టేషన్‌లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాసాధనకై వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో రైల్‌రోకో కార్యక్రమం నిర్వహించారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో రైల్వే చట్టాల ప్రకారం వైకాపా నాయకులు కరుణాకర్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సిద్దారెడ్డి, ఎస్‌కె బాబు, తిరుమలరెడ్డి, షంషీర్, శెట్టిపల్లి లక్ష్మీపతి, లక్ష్మయ్య, హరిప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌లపై కేసు నమోదుచేశారు. 9 నెలలుగా జరుగుతున్న కేసు విచారణలో భాగంగా గురువారం నెల్లూరు రైల్వేకోర్టులో న్యాయమూర్తి కేసు కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.