క్రైమ్/లీగల్

ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వరు. జస్టిస్ ఏకే సిక్రీ, ఎ అబ్దుల్ నజీ ర్, ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రివ్యూ పిటిషన్‌తో సహా ఈ పిటిషన్లను విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొం ది. ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం అమలును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ల తరఫున న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ తప్పుడు అభియోగాల కింద ఈ కేసులో అరెస్టులు చేసుకుంటూ పోతే గందరగోళం నెలకొంటుందన్నారు. మరో పిటిషనర్ తరఫున న్యాయవాది గోపాల శంకరనారాయణన్ మాట్లాడుతూ, కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, ఈ నేపథ్యంలో సవరం చట్టంపై స్టే ఇవ్వాలని కోరారు. కాగా ఈ సవరణ చట్టంపై స్టే ఇవ్వబోమని ఈ సం దర్భంగా ధర్మాసనం స్పష్టం చేసిం ది. ఈ చట్టం విషయమై సుప్రీంకోర్టు ఇచ్చి న మార్గదర్శకాలను పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టాన్ని కేంద్రం పార్లమెంటులో గత ఏడాది ఆగస్టు నెలలో ప్రవేశపెట్టగా, ఆమోదం లభించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, రివ్యూ పిటిషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టాన్ని సవా లు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. రివ్యూ పిటిషన్‌పై ఇప్పటికే కేంద్రానికి నోటీసులు జారీ చేశామని, ఈ చట్టంపై దాఖలైన పిటిషన్లను విచారించే విషయమై త్వరలో తేదీలను లిస్టు చేస్తామన్నారు. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై తీసుకునే నిర్ణయం , పిటిషన్లవిచారణపైప్రభావం ఉంటుందన్నారు. ఈ కేసును విచారించే తేదీలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం పేర్కొంది.