క్రైమ్/లీగల్

విచారణ నుంచి తప్పుకున్న సిక్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారించే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ తప్పుకున్నారు. దీంతో ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మను తొలగించిన ఉన్నత కమిటీలో జస్టిస్ సిక్రీ సభ్యుడుగా ఉన్నారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చిన వెంటనే, తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ సిక్రీ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దావేకు తెలిపారు. పిటిషన్‌దాఖలు చేసిన ఎన్‌జీవో కామన్ కాజ్ సంస్థ తరఫున దావేవాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు విచారణను మీరే చేస్తే బాగుంటుందని న్యాయవాది దావే కోర్టుకు తెలిపారు. ఇదే కేసును సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌ను విచారించే ధర్మాసనం నుంచి గత సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ తప్పుకున్నారు. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌వాదనలు వినిపిస్తూ, జస్టిస్ సిక్రీ ఈ కేసును విచారిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కాగా పిటిషనర్ తన పిటిషన్‌లో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు నియామకంలో పారదర్శకత ఉండాలన్నారు. ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు నాగేశ్వరరావును నియమించలేదన్నారు.