క్రైమ్/లీగల్

జూలై 31లోగా ఎన్‌ఆర్‌సీ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: అసోంలో పౌరసత్వ నిర్ధారణకు ఉద్దేశించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) తయారీని ఈ ఏడాది జూలై 31లోగా పూర్తి చేయాలని, దానిని పొడిగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో త్వరలో సారస్వత ఎన్నికలు వస్తున్నాయని, అయితే దాని ప్రభావం ఎన్‌ఆర్‌సీ తయారీ ప్రక్రియపై ఉండరాదని, దీనిపై అధికార యంత్రాంగం సమావేశమై ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. దీని నిమిత్తం అసోం ప్రభుత్వం, ఎన్నికల కమిటీ కార్యదర్శి, ఎన్‌ఆర్‌సీ కోర్డినేటర్‌లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ సమావేశాన్ని వారం రోజుల్లో జరపాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమనల్‌లతో కూడిన ధర్మాసనం అసోం ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఇతర అంశాలను కేసు తదుపరి విచారణ తేదీ ఫిబ్రవరి ఐదున కోర్టుకు తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.