క్రైమ్/లీగల్

భూపాల్‌పల్లి మైనింగ్‌పై విచారణ 8కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: భూపాలపల్లిలో జరుగుతున్న ‘ఓపెన్ కాస్ట్ మైనింగ్’ నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా పడింది. నివాస ప్రాంతాలకు సమీపంలో జరిగే పేలుళ్లువల్ల వచ్చే ప్రకంపనాలకు గృహాలు దెబ్బతింటున్నాయని, పిల్లలు, వృద్ధులు, మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని రాజలింగమూర్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ నోటిసులు జారీచేసింది. అయితే పర్యావరణ నిబంధనలు పాటించడం లేదంటూ ఎన్జీటీకి కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. గురువారం ట్రిబ్యునల్‌లో ఈ పిటిషన్ విచారణ రాగా.. తుది వాదనలు ఫిబ్రవరి 8న వింటామని ట్రిబ్యునల్ బెంచ్ పేర్కొంది.