క్రైమ్/లీగల్

కొణతాల పిటిషన్‌పై వివరణకు కేంద్రానికి రెండు వారాలు గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 24: రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 2017-18సంవత్సరానికి గాను కేంద్రం ఇచ్చిన 350 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి తీసుకోవడంపై మాజీమంత్రి కొణతాల రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం గురువారం విచారించింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో కేంద్రం 2018 ఫిబ్రవరి 9వ తేదీన 350 కోట్లు వేసి మరలా 15న వెనక్కు తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి హైకోర్టులో గత జూన్ 13న కొణతాల రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. నిధులను ఎందుకు వెనక్కి తీసుకోవాల్సిన వచ్చిందో వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై గురువారం నాటి విచారణ సందర్భంగా కేంద్ర తరుఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎం కృష్ణమోహన్ హాజరయ్యారు. ధర్మాసనానికి పూర్తి వివరాలు సమర్పించేందుకు మరో మూడు వారాలు సమయం కావాలని ఆయన కోర్టును కోరారు. కేంద్ర ప్రభుత్వానికి మరింత సమయం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుందని, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని కొణతాల తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనను పరిగణనలోకి తీసుకుని రెండు వారాలు సమయం ఇస్తూ విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.