క్రైమ్/లీగల్

పులి చర్మం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందమర్రి, జనవరి 24: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీ ఏరియాలోని గౌతమి నగర్‌లో గురువారం ఫారెస్ట్ అధికారులు ఐలవేని అంజయ్య అనే సింగరేణి కార్మికుని క్వార్టర్‌పై దాడి చేసి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలోకి వెళ్తే సింగరేణిలో పని చేసి పదవీ విరమణ పోందిన ఐలవేని లింగయ్య అనే వ్యక్తి పదవీ విరమణ పోందిన అనంతరం చొప్పదండిలో నివాసం ఉంటున్నాడు. ఐలవేని లింగయ్య తన సోదరుడు అయిన అంజయ్యకు ఆ క్వార్టర్‌ను కేకే 5 గనిలో పని చేసే ఐలవేని అంజయ్య అనే కార్మికుడు గత కొంత కాలంగా కిరాయి తీసుకొని నివాసం ఉంటున్నాడు. ఫారెస్ట్ అధికారులు ఇంటిపై దాడి చేయగా పులి చర్మం లభించింది. అంజయ్యతోపాటు అతని పెద్ద కుమారుడు పరారీలో ఉండగా, అతని చిన్న కుమారుడు అయిన ఐలవేని శ్యాంను, మరోక్క వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వీరితో పాటు రెండు బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసును విచారణ చేపడుతున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈసంఘటన మందమర్రిలో కలకలం సృష్టించింది. వివరాల్లోకెళితే... మహారాష్టక్రు చెందిన టైగర్ హాంటింగ్ ఎండ్ సోసైటీ అనే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రతినిధులు గురువారం సాయంత్రం అటవీ అధికారుల సాయంతో పులి చర్మాన్ని కొనుగోలు చేస్తామని వేషంలో వెళ్లగా నమ్మి విక్రయించేందుకు నిందితులు సిద్దపడ్డారని మంచిర్యాల డి ఎఫ్ ఒ రామలింగం తెలిపారు. మొదట పులి చర్మం మందమర్రి ఉన్నదన్నా సమాచారం తెలుసుకున్న స్వచ్చంద సంస్థ ప్రతినిధుల బృందం కాగజ్‌నగర్‌లో ఓ ప్రదేశానికి తీసుకొస్తే కొనుగోలు చేస్తామని చెప్పగా , పులి చర్మం విక్రయించే వారు కాగజ్‌నగర్‌కు రాలేమని, రామన్ కాలనీ ఏరియాలో గౌతమి నగర్‌కు రావాలని సూచించారు. దీనితో స్వచ్చంద సంస్థ ప్రతినిధులు మారు వేషంలో అటవీ అధికారులకు సమాచారం అందించి దాడులు నిర్వహించారు.

చిత్రం..పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది