క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, జనవరి 24: వాహనాన్ని పార్కింగ్ చేసేందుకు వెనక్కు తీసుకుంటున్న క్రమంలో హైటెన్షన్ వైర్లను తాకడంతో విద్యుదాఘాతం సంభవించి కంటైనర్‌కు నిప్పంటుకోగా, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంకెనపల్లి గ్రామ శివారులోని ఎంఆర్‌ఎఫ్ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి కథనం ప్రకారం తమిళనాడుకు చెందిన కంటైనర్ స్థానిక ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమకు రవాణా వస్తువులను తీసుకుని వచ్చింది. వస్తువులను ఖాళీ చేసేందుకు సమయం ఉన్నందున అక్కడే ఉన్న పార్కింగ్ స్థలంలోకి డ్రైవర్ మరియప్ప (35) కంటైనర్‌ను తీసుకువెళ్లాడు. వాహనాన్ని వెనక్కు తీసుకుని పార్కింగ్ చేస్తుండగా అక్కడే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు కంటైనర్‌కు తగలాయి. ఈ సంఘటనతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ రావడంతో స్టీరింగ్ సీట్లోంచి ఎగిరి కింద పడిన మరియప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా విద్యుత్ వైర్ల నుంచి చెలరేగిన మంటలతో కంటైనర్ వెనక టైర్లకు నిప్పంటుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటంతో వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పివేసారు.
నిప్పంటుకున్న కంటైనర్ ప్రక్కనే పార్కింగ్ చేసిన ఇతర వాహనాలను హుటాహుటిన అక్కడి నుంచి తప్పించడంతో భారీ ఆస్తి నష్టం తప్పింది. డ్రైవర్ మరియప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..దగ్ధమవుతున్న కంటైనర్ మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది