క్రైమ్/లీగల్

బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, జనవరి 27: పోలీసుల కృషి ఫలితంగా కలకలం సృష్టించిన బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సంఘటన జరిగిన 24గంటల లోపే మిస్టరీని ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకొని సర్కిల్ పోలీసులు రికార్డు సృష్టించారు. కిడ్నాపర్‌ల చెర నుంచి బాలికను విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలకేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీఐ అయోధ్య ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మద్దిరాల మండలం చిననెమిల క్రాస్‌రోడ్డుకు చెందిన లింగాల వెంకన్న ఏడేళ్ల కుమార్తె కీర్తన సెలవులు కావడంతో నూతనకల్ మండలంలోని మామిళ్లమడవ గ్రామంలోని వెంకన్న సోదరుని ఇంటివద్ద వెళ్లి స్వగ్రామానికి వెళ్లిపోయారు. కాగా మామిళ్లమడవ పరిధిలోని ధారవత్‌తండాకు చెందిన ధారవత్ వీరన్న అతని భార్య శాంతి, ధారవత్ రవి బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు స్వగ్రామానికి వచ్చిన వారు శనివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. బాబాయి ఇంటివద్ద ఆడుకుంటున్న చిన్నారి కీర్తనను గమనించి కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకొని చిన్నారికి మయామాటలు చెప్పి బిస్కెట్ ప్యాకెట్‌లు ఇచ్చి తమతో బస్సులో హైదరాబాద్ తీసుకెళ్లారు. బాలిక కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామం నుంచి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు వ్యక్తులు బాలికను తీసుకెళ్లినట్లు గ్రామస్థుల నుంచి సమాచారం తెలుసుకొని హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీసులకు సమాచారం అందించగా అక్కడ పోలీసులు కిడ్నాపర్‌లను అదుపులోకి తీసుకొని బాలికను, నిందితులను స్ధానిక పోలీసులకు అప్పగించారు. డబ్బు కోసం బాలికను ఇతరులకు విక్రయించేందుకు కిడ్నాప్ చేసినట్లు సీఐ తెలిపారు. వీరిపై గతంలో ఎలాంటి కేసులూ లేవన్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. 24గంటల్లోనే ఈ కేసును ఛేదించిన నూతనకల్ ఎస్‌ఐ వీరబాబు, పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న తుంగతుర్తి సీఐ అయోధ్య