క్రైమ్/లీగల్

విలీన మండలాల పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పోలవరం ప్రాజెక్టు ఏడు ముంపు మండలాల్లో నియోజకవర్గాల పునిర్విభజన జరగకుండా ఎన్నికలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ శశిధర్‌రెడ్డి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ మర్రి సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. శశిధర్‌రెడ్డి తరపున జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170, నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 9 సవరించాల్సి వుందని, కాని వాటిని పట్టించుకోకుండా తెలంగాణలో ఎన్నికల సంఘ నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించిందని వాదించారు.

ఈ పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.