క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, జనవరి 28: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు కరెంటు షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మన్‌మోహన్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం మునిమాముల గ్రామానికి చెందిన ఎస్. అరవింద్(19) మల్కాజిగిరి పరిధిలోని వౌలాలి జడ్‌టీసీ చౌరస్తాలోని ఆర్‌పీఎఫ్ సెంటర్‌కు ఉద్యోగ ఎంపిక కోసం తన స్నేహితులతో కలసి ఆదివారం రాత్రి వచ్చాడు. రాత్రి అక్కడ ఉన్న పుట్‌ఫాత్‌పై నిద్రించినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుఝామున 4 గంటలకు బహిర్బూమికి వెళ్లేందుకు పక్కనే ఉన్న ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. చీకట్లో పైన ఉన్న విద్యుత్ వైరు తగలడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతిచెందినట్టు సీఐ తెలిపారు. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
కరెంటు షాక్ తగిలి మృతిచెందిన అరవింద్ కుటుంబ సభ్యులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు పరమర్శించారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతికి కారణాలను పోలీసులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ పరంగా లక్ష రూపాయలు, సొంతగా లక్ష రూపాయలు అందజేయనున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. దహన సంస్కరాల కోసం మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున ఆర్థిక సహాయాన్ని మృతుని తండ్రి ఆంజనేయులుకు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు ఆకుల నర్సింగ్‌రావు, గొల్లురి అంజయ్య, మేకల రాముయాదవ్, అమీనుద్దీన్, జీఎన్‌వీ సతీష్ కుమార్, అయూబ్‌అలీ పాల్గొన్నారు.