క్రైమ్/లీగల్

బంగారు ఆభరణాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, జనవరి 28: దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి బంగారు అభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు. బాలానగర్ డివిజన్ గౌతంనగర్‌కు చెందిన సయ్యద్ మజహర్ హుస్సేన్(22) గతంలో జైలు జీవితం గడిపి వచ్చి తన ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 22న కేపీహెచ్‌బీకాలనీ రోడ్ నంబర్ 3లోని శివాలయం సమీపంలో నివాసం ఉంటున్న అనిల్‌కుమార్ అనే వ్యక్తి ఉద్యోగం నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. ఇది గమనించిన మజహర్ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 4.5 తులాల బంగారు ఆభరణాలతో పాటు నగదును తీసుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తులో భాగంగా మజహర్‌ను గౌతంనగర్‌లోని నివాసం వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. చోరికి గురైన నగదు, సెల్‌ఫోన్‌తో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును విచారించిన డీఐ.వెంకటేశం, ఎస్‌ఐ.హరిశంకర్, ఎఎస్‌ఐ.పరుశరాం, క్రైం సిబ్బంది మధుసుదన్, పురందాస్‌లను సీఐ అభినందించి నగదు రివార్డును అందజేశారు.