క్రైమ్/లీగల్

చిదంబరానికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి కోర్టులో ఊరట లభించింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ కుంభకోణం కేసుకు సంబంధించి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తిని అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఫిబ్రవరి 18 వరకు పొడిగిస్తున్నట్టు ఢిల్లీ కోర్టు సోమవారం ప్రకటించింది. ఈ కేసు విచారణ జరగాల్సిన ఫిబ్రవరి ఒకటో తేదీని తాను అందుబాటులో ఉండనందున వీరిద్దరికి అరెస్టు నుంచి మినహాయింపును పొడిగిస్తున్నట్టు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఓపీ సైనీ తెలిపారు. 18 మంది దోషులుగా నిర్ధారించిన సీబీఐ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిల పేర్లు సైతం చార్జిషీటులో చేర్చి గత ఏడాది జూలై 19న కేసు నమోదు చేసింది. తర్వాత జూలై 31న సప్లిమెంటరీ చార్జిషీటును సైతం దాఖలు చేసింది. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2006లో నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ కమిటీ ద్వారా అనుమతి పొందకుండా ఫారెన్ ఇనె్వస్టుమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపిబి) ద్వారా విదేశీ సంస్థలకు సానుకూలంగా వ్యవహరించి ఎయిసెల్-మాక్సిస్‌కు 3500 కోట్ల రూపాయల డీల్ కుదిర్చారని, ఇందులో ఐఎన్‌ఎక్స్ మీడియాకు 305 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. మాక్సిస్‌కు సబ్సిడరీ కంపెనీ అయిన మారిషస్‌కు చెందిన గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్ లిమిటెడ్ కంపెనీకి ఎఫ్‌ఐపీబీ ద్వారా చిదంబరం అనుమతులు ఇచ్చారని తెలియజేసింది. కాగా, దీనిలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణపై ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ సైతం ఈ కేసును పరిశోధిస్తోంది. దీని నిమిత్తం ఇప్పటికే చిదంబరాన్ని ఈడీ పలుసార్లు ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది.