క్రైమ్/లీగల్

ఆయేషా కేసులో అప్పటి దర్యాప్తు అధికారులను ప్రశ్నించనున్న సీబీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 28: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. ఘటన జరిగినప్పుడు అప్పటి దర్యాప్తు అధికారులతోపాటు పలువురు పోలీసులను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ చేపట్టిన సిబిఐ పలువురిని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా ఆయేషా మీరా కేసును తొలుత దర్యాప్తు చేసిన పోలీసులను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఈ కేసులో అప్పటి పోలీసులు కృష్ణాజిల్లా నందిగామ అనాసాగర్‌కు చెందిన పిడతల సత్యంబాబును దోషిగా తేల్చి కోర్టు ముందు నిలబెట్టడంతో విజయవాడ న్యాయస్ధానం జీవితఖైదు విధించింది. ఆతర్వాత సత్యంబాబును నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు తీర్పు చెప్పడంతో ఎనిమిది సంవత్సరాల జైలుజీవితం అనంతరం నిర్దోషిగా సత్యంబాబు విడుదలయ్యాడు. అయితే ఆయేషామీరా హత్య, అత్యాచారం కేసులో అసలు దోషులను గుర్తించేందుకు హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసిన మీదట సత్యంబాబును ఇటీవల కొన్ని గంటలపాటు ప్రశ్నించింది. సిబిఐ దర్యాప్తులో సత్యంబాబు చెప్పిన అంశాలు అసక్తిని రేకెత్తించాయి. తనను ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు పోలీసులు అప్పట్లో బెదిరించి కేసులో ఇరికించారని, నేరం ఒప్పుకోకుంటే చేంపేస్తామని ఒత్తిడి తీసుకువచ్చారని సీబీఐ అధికారుల ఎదుట వెల్లడించాడు. హత్య జరిగిన 11 సంవత్సరాలు గడవడం, కేసులో సాక్ష్యాలు ధ్వంసం కావడం, ఇదే సమయంలో తాజాగా సత్యంబాబు చేసిన ఆరోపణల నేపధ్యంలో సీబీఐ అధికారులు అప్పటి దర్యాప్తు అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించారు. అప్పటి పోలీసుల విచారణపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇప్పటికే 15మంది పోలీసుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి తొలివారంలో ఒక్కొక్కరిగా పోలీసులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.