క్రైమ్/లీగల్

పురుగుల మందు నీరు తాగిన ఇద్దరు చిన్నారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాగనూర్, మార్చి 18: మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండల కేంద్రంలో ఆదివారం ఇద్దరు చిన్నారులు గుళికల మందు పిచికారి చేసిన పొలంలోని మంచినీరు అనుకుని తాగడంతో ఓ చిన్నారి మృతి చెందగా మరో చిన్నారి బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మాగనూర్ మండల కేంద్రానికి చెందిన రఫీ అనే రైతుకు చెందిన ఇద్దరు చిన్నారులు మధినా, షమ్రీన్‌లు తమ పొలం దగ్గరకు వెళ్లారు. అయితే ఇంటి నుండి తండ్రితో పాటు వచ్చిన చిన్నారులకు తండ్రి రఫీ గ్రామంలో ఓ హోట ల్ నుండి బజ్జీలు(మిర్చి) మరికొన్ని తినుబండారాలను వారికి తీసుకెళ్లారు. వాటిని ఇద్దరు పిల్లకు ఇచ్చిన ఆయన తన పశువుల దగ్గరకు వెళ్లాడు. వాటిని తిన్న చిన్నారులు పొలంలో ఉన్న నీటిని ఎప్పటిలాగానే తాగారు. కానీ శనివారం ఆ పొలంలో వేసిన పంటకు గుళికల మందును రైతు రఫీ పిచికారి చేశారు. మంచినీరు అనుకుని తాగిన నీరు గుళికల మందు పిచికారి చేయడంతో విషం ఉన్న సంగతి తెలియ ఇద్దరు చిన్నారు లు ఆపస్మారక స్థితిల్లో పడ్డారు. పిల్లలు కనపడకపోవంతో అనుమానం వచ్చిన తండ్రి పంటపొలం దగ్గరకు వచ్చి చూసేరి ఇద్దరు పిల్లలు గెట్టుపై పడిపోయారు. అప్పటికే నాలుగేళ్ల చిన్నారి మధినా చనిపోగా ఆపస్మారక స్థితిలో ఉండి ఊపిరితో ఉన్న సమ్రీన్‌ను ఊటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులకు మాత్రం కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు అందలేదు.