క్రైమ్/లీగల్

ఏసీబీలో వలలో బీమా అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 28: వరంగల్ అర్బన్ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా (పీఎల్‌ఐ) అధికారి పల్లకొండ యాదగిరిని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం జిల్లా కోర్టు క్యాంటీన్‌లోనే ఈ వ్యవహారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ కే. భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 2011 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ సమ్మయ్య 2018 సెప్టెంబర్‌లో మృతిచెందారు. మృతుడికి సంబంధించిన మూడు లక్షల క్లైమ్ విషయంలో జీవిత బీమా కార్యాలయంలోని సూపరింటెండెంట్ పల్లకొండ యాదగిరిని కలువగా మూడు లక్షల క్లైమ్ చెక్కులు ఇవ్వాలంటే 64వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక మృతుని సొదరుడు శాయంపేటకు చెందిన రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారి యాదగిరి అడిగిన డబ్బులు తీసుకుని ఫోన్ చేయగా జిల్లా కోర్టు క్యాంటీన్‌లో ఉన్నానని ఇక్కడికి డబ్బులు తీసుకుని రమ్మని చెప్పగా ఒక పథకం ప్రకారం.. ఏసీబీ అధికారులను వెంట తీసుకుని అక్కడికి వెళ్లారు. 64వేల 500 డబ్బులు ఇస్తుండగానే రెడ్ హాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తునట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.
చిత్రం.. బీమా అధికారి పల్లకొండ యాదగిరి