క్రైమ్/లీగల్

ఢిల్లీ హైకోర్టులో హై డ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: ఢిల్లీ హైకోర్టులో బుధవారం హై డ్రామా చోటు చేసుకుంది. కాంఅగెస్ సీనియర్ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్య ప్రతిభా సింగ్‌పై వచ్చిన అక్రమార్జన ఆరోపణల కేసు విచారణకు న్యాయమూర్తి వజీరీ తిరస్కరించారు. ఈ కేసులో ముద్దాయిల తరఫున వాదించాల్సిన కాంగ్రెస్ సీనియర్ నేత, అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వి వస్తేనే విచారణ సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. సింఘ్వి మరో కేసులో తీరిక లేకుండా ఉన్నారని, ఆయన తరఫున తాను కేసును వాదిస్తానని ఓ లాయర్ వజిరీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన నిరాకరించారు. ఈ కేసు విచారణకు వచ్చిన తొందరేమీ లేదని, సింఘ్వి వచ్చిన తర్వాత వాదన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. వీరభద్ర సింగ్ కేసును తాను చేపడతానని వచ్చిన లాయర్ పదేపదే చెప్పడంతో వజీరీ అసహనం వ్యక్తం చేశారు. ఈ దశలో మరో సీనియర్ న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ వజీరీ ముందు హాజరై, సింఘ్వి అదే కోర్టులో, మరో కేసులో బిజీగా ఉన్నారని, కాబట్టి, ఆయన తరఫున వాదించే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. కానీ, వజీరీ సానుకూలంగా స్పందించలేదు. కేసును ఫిబ్రవరి ఆరో తేదీకి వాయిదా వేశారు. 82 ఏళ్ల వీరభద్ర సింగ్, ఆయన భార్య ప్రతిభ అక్రమార్జన కేసులో ఈనెల 24న న్యాయమూర్తి ముక్తా గుప్తా కూడా ఇదే విధంగా కేసును విచారణకు స్వీకరించకుండా, వాయిదా వేశారు.