క్రైమ్/లీగల్

యూపీలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనాభద్ర (యూపీ): యూపీలో జరిగిన రోడ్ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వేగంగా వచ్చిన ట్రక్ బస్సును ఢీకొని పక్కనే ఆగిఉన్న ట్రక్కుపైకి దూసుకుపోయిన సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం యూపీలోని అనపర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బైరపన్ గ్రామంలో మంగళవారం రాత్రి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఒక బస్సును ఢీకొని సమీపంలోని పెట్రోల్‌బంక్ సమీపంలో ఆగిఉన్న ట్రక్కుపైకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆగిఉన్న ట్రక్కు వద్ద టైరు మారుస్తున్న వారితో పాటు బస్సులోని ప్రయాణికులు మొత్తం ఐదుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి శైలేష్ రాజ్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ దానిని అక్కడే వదిలేసి పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.