క్రైమ్/లీగల్

ఇద్దరు బధిర విద్యార్థినుల అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జనవరి 30: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం విద్యానగర్ కాలనీలోని గిరిజన బాలికల వసతి గృహం నుండి ఇద్దరు బధిర విద్యార్థినిలు అదృశ్యమయ్యారని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆడావత్ పార్వతి బుధవారం స్థానిక ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 29 ఉదయం 5 గంటలకు వాచ్‌మెన్‌కు మాయమాటలు చెప్పి బ్యాగులతో వెళ్లిపోయారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమె కోసం గాలించిన అనంతరం బుధవారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐతే ఈ బాలికలిద్దరూ ముంబ యలో ఉన్నట్టు రాత్రి బాగా పొద్దు పోయాక పోలీసులకు సమాచారం అందింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం కటకేరి సాయిబన్న కుమార్తె కటకేరి నింగమ్మ, కరీంనగర్ జిల్లా చిప్పలపల్లి గ్రామానికి చెందిన ఆలపు మహేష కుమార్తె ఆలెపు పూజ మిర్యాలగూడ ప్రభుత్వ బధిర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కు చెప్పపెట్టకుండా బ్యాగులతో వెళ్లిన విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి ఒన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
విచారించిన ఆర్డీఓ
మిర్యాలగూడ పట్టణం విద్యానగర్‌లో ఉన్న ఎస్సీ వసతిగృహం నుంచి ఇద్దరు బధిర విద్యార్ధినిల అదృశ్యం కావడాన్ని తెలుసుకున్న ఆర్డీఓ జగన్నాధరావు, ఎఎస్‌సిడబ్లుఓలు బుధవారం నాడు వసతి గృహాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు విద్యార్ధినిలు కె.నింగమ్మ, ఎ.పూజలు ఈ నెల 29 ఉదయం బ్యాగులు తీసుకుని వెళ్లారని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆడావత్ పార్వతి తెలిపారు. వాచ్‌మెన్ కళ్లు కప్పి ఇద్దరు వెళ్లారన్నారు. వారు అదృశ్యమైన అనంతరం వారి గురించి అన్ని చోట్ల ఆరా తీసామన్నారు. ఎక్కడ కానరాకపోవడంతో ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్డీఓకు వివరించారు.

అదృశ్యమైన కటికేరి నింగమ్మ, ఆలెపు పూజ (ఫైల్‌ఫోటోలు)