క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ఎంవీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 30: సంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం రూ.5వేల లంచం తీసుకుంటూ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అనిల్ చౌహన్‌ను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. బాలాజీ ఎంటర్‌ప్రైజేస్ పేరుతో ట్రాక్టర్ ట్రైవీల్స్ తయారుచేసే వ్యాపారం చేసుకుంటున్న సందీప్ తన లైసెన్స్ రెన్యువల్ కోసం ఆర్టీఎ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. రెన్యువల్ కోసం పరిశీలించి రిపోర్టు ఇచ్చేందుకు ఎంవీఐ రూ.5వేలను డిమాండ్ చేసాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని సందీప్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఉదయం ఎసీబీ అధికారులు ఆర్టీఎ కార్యాలయానికి చేరుకొని సందీప్‌తో డబ్బులను పంపించారు. ఎంవీఐ డబ్బులు చేతితో తీసుకోకుండా అక్కడే పనిచేసే హోంగార్డు సాయిరాంకు చెప్పాడు. హోంగార్డు కార్యాలయం బయట సాయికుమార్ అనే ఏజెంట్ ఉంటాడని అతనికి డబ్బులు ఇవ్వాల్సిందిగా సందీప్‌కు చెప్పాడు. బయట ఉన్న ఏజెంట్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తనకు ఏం సంబంధం లేదని ఎంవీఐ, హోంగార్డు చెప్పిన మేరకే డబ్బులు తీసుకున్నానని సమాధానం ఇచ్చాడు. ఆర్టీఏ కార్యాలయంలోకి వెళ్లిన ఏసీబీ అధికారులు విచారించి ఎంవీఐతో పాటు హోంగార్డు, ఏజెంట్‌ను అరెస్టు చేసారు. కేసు విచారణ చేపడుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
చిత్రం.. ఏసీబీ అధికారుల అదుపులో ఉన్న ఎంవీఐ, హోంగార్డు, ఏజెంట్