క్రైమ్/లీగల్

శబరిమల కేసు విచారణ 6న ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: సుప్రీంకోర్టు శబరిమల ఆలయ కేసు విచారణను వచ్చే వారం ప్రారంభించనుంది. శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయసులో ఉన్న బాలికలు, మహిళలను సయితం అనుమతిస్తూ సెప్టెంబర్ నెలలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్లను అది విచారించనుంది. సుమారు 48 రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి ఆరో తేదీన ఈ పిటిషన్ల విచారణను ప్రారంభిస్తుంది. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 22వ తేదీన ఈ కేసు విచారణ ప్రారంభం కావలసి ఉంది. అయితే, రాజ్యాంగ ధర్మాసనంలోని సభ్యురాలయిన న్యాయమూర్తి ఇందు మల్హోత్రా మెడికల్ లీవులో ఉండటం వల్ల ఆ షెడ్యూల్ రద్దయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పది నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులయిన బాలికలు, మహిళలు శబరిమలలోని ఆలయంలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ అయ్యప్ప భక్తులు తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కొంత మంది మహిళలు చివరకు ఆలయంలోకి ప్రవేశించగలిగినప్పటికి వారు తీవ్రమయిన నిరసనను ఎదుర్కొన్నారు. వారికి ఇప్పటికీ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. వీరిలో ఒకరిపై స్వయానా ఆమె అత్తయే దాడి చేసింది. తీర్పు వెలువడిన తరువాత మొత్తం 51 మంది రుతుస్రావ వయసులో ఉన్న బాలికలు, మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే, మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న భక్తులు, ఆందోళనకారులు ఈ గణాంకాలపై ప్రభుత్వంతో విభేదిస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మాత్రమే తాను అమలు చేశానని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి అనుకూలంగా తొలుత మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరువాత తన వైఖరి మార్చుకున్నారు.