క్రైమ్/లీగల్

బీజేపీ మహిళా నేతకు వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జనవరి 31: సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తనను కొంతమంది వేధిస్తున్నారంటూ తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడకు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు ఒకరు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజలక్ష్మిని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గత కొన్ని రోజులుగా అసభ్యకరమైన పోస్టింగ్‌లు, కామెంట్లతో వేధింపులకు గురిచేస్తున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పార్టీ జిల్లా అధ్యక్షులు యెనిమిరెడ్డి మాలకొండయ్య, కాకినాడ నగర అధ్యక్షులు చిట్నీడి శ్రీనివాస్ తదితర నాయకులతో కలసి గురువారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలవడానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎస్పీ సూచనపై కాకినాడలోని సర్పవరం పోలీసు స్టేషన్ సీఐ గోవిందరాజును కలసి పద్మజలక్ష్మి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆమె ఫిర్యాదు వివరాలను పత్రికలకు విడుదలచేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు తన ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా కియా కార్ల పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కు అందించిన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తాను ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ పెట్లినట్లు చెప్పారు. తాను ఫేస్‌బుక్‌లో కియో కార్ల పోస్టింగ్ పెట్టిన మరుక్షణం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు చదవడానికి, వినడానికి వీలుకాని అసభ్య పదజాలంతో, అసహ్యంగా, అభ్యంతరకర రీతిలో తనపై ఫేస్‌బుక్‌లో పోస్టులు, కామెంట్స్ పెడుతూ వేధిస్తున్నట్లు పద్మజలక్ష్మి పేర్కొన్నారు. సాగర్ మురళి, చౌదరిజగన్, రాజా వెల్లంకి, మాలతీరెడ్డి, ఎన్‌ఎస్ విశ్వనాధ్, జెవిరావ్ జంపతి, రాజా కుసుమంచి, సురేష్ పోతినేని, ఎన్‌బికె సురేష్ తదితర వ్యక్తులు వారి ఫేస్‌బుక్ అకౌంట్ల ద్వారా పోస్టింగ్స్ పెడుతున్నట్లు ఆమె తన ఫిర్యాదులో తెలియజేశారు. సభ్య సమాజం తలదించుకునేలా, తనను మానసికంగా మనోవ్యధకు, ఆత్మక్షోభకు వారు గురిచేస్తున్నారని పద్మజలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు యెనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ ఎస్పీకి వివరాలను తెలియజేయడంతో ఆయన సూచనలపై సర్పవరం సిఐ గోవిందరాజును కలసి ఫిర్యాదుచేసినట్లు చెప్పారు. బాధిత పద్మజలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి బాధ్యులుపై చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పద్మజలక్ష్మికి న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర గవవర్నర్, రాష్ట్ర మహిళా కమీషన్‌ను కలసి ఫిర్యాదుచేస్తామన్నారు. అప్పటకీ న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మాలకొండయ్య తెలియజేశారు.
చిత్రం..సీఐకి ఫిర్యాదు అందిస్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పద్మజలక్ష్మి