క్రైమ్/లీగల్

న్యాయవాదిపై దాడి కేసులో సీఐకి ఆరు నెలల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 31: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల క్రితం గోపిఅనే న్యాయవాదిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ డి.కృష్ణకు కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి ఆరు నెలల జైలుశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. న్యాయవాది గోపి అందిచిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2013మార్చి 30 కామారెడ్డి పట్టణ శివారులోని ఒక భూమి వివాదం విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కుటుంబ సభ్యుల్లో ఒకరైన కామారెడ్డి వాస్తవ్యుడు న్యాయవాది చింతల గోపి ఒకరు. ఆ సమయంలో కామారెడ్డి సీఐగా పనిచేస్తున్న డి.కృష్ణ అకారణంగా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపై సీఐ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దాడి చేశారని, ఈ విషయమై ఆరోజు జర్నలిస్టులు, న్యాయవాదులు సైతం ఆందోళనలు చేశారు. ఇంతే కాకుండా వందరోజుల పాటు న్యాయవాదులు విధులకు దూరం ఉండి కోర్టు ఎదుట నిరసనలు కూడా వ్యక్తం చేశారు. న్యాయవాదిపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్ని ఆందోళనలు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంతో బాధిత న్యాయవాది చింతల గోపి సీఐ డి.కృష్ణపై ఐపీసీ సెక్షన్ 200 కింద కామారెడ్డి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖల్ చేశారు. ఈ కేసు కామారెడ్డి కోర్టులో గత ఆరు సంవత్సరాలుగా కొనసాగింది. ఈ కేసులో చివరకు న్యాయమూర్తి సాక్షులను విచారించిన అనంతరం నిందితుడైన సీఐ డి.కృష్ణపై నేరం రుజువు కావడంతో అతనికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కామారెడ్డి (జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్) న్యాయమూర్తి కిరణ్మయి గురువారం తీర్పునిచ్చారు. జరిమానా కట్టనిచో అదనంగా మరో నెలరోజుల పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారని తెలిపారు. న్యాయమూర్తితీర్పు పట్ల కామారెడ్డి బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
సీఐ కృష్ణ (ఫైల్‌ఫొటో)