క్రైమ్/లీగల్

చెరువులో ఇద్దరు విద్యార్థినుల గల్లంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జనవరి 31: జిల్లా కేంద్రమైన నల్లగొండ వద్ద పానగల్లు ఉదయ సముద్రం చెరువులో ఇద్దరు విద్యార్థినులు గల్లంతైన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, విద్యార్థినిల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరుకు చెందిన తిగుల్ల శ్రావణి హైదరాబాద్‌లో కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లుకు చెందిన హబీబున్నీసా గత సంవత్సరం ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. కాగా గత సంవత్సరం శ్రావణి ఫస్ట్ ఇయర్, హబీబున్నీసా సెకండ్ ఇయర్ చదువుతున్న క్రమంలో ఇద్దరమ్మాయిల మధ్య స్నేహం పెరిగింది. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో హబీబున్నీసా నల్లగొండలో వెంకటేశ్వర కళాశాలలో టీటీసీ విద్యనభ్యసిస్తూ ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. పది రోజుల క్రితం శ్రావణి చౌటుప్పల్‌లో తన నివాసానికి వచ్చి అక్కడే ఉంది. కాగా గురువారం ఉదయం తన తండ్రితో కలిసి ఇంటర్నెట్ షాపునకు వెళ్లిన శ్రావణి అక్కడి నుంచి అదృశ్యమైంది. ఆమె తండ్రి శ్రావణి కోసం వెతికి ఇంటికి వెళ్లి చూడగా ఆమె అక్కడ లేక పోవడం, ఇంట్లో సూసైడ్ నోట్ లభించడంతో స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చౌటుప్పల్ బస్టాండ్ వద్ద సీసీ కెమెరాలో గుర్తించారు. ఎటు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరికి నల్లగొండలో తన స్నేహితురాలు దగ్గరికి వెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో ఆమనగల్లులో ఉన్న హబీబున్నీస తండ్రి ఖలీల్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. వెంటనే అనుమానం వచ్చిన ఖలీల్ నల్లగొండలో తన బంధువులకు ఫోన్‌లో విషయం తెలియజేయగా బంధువులు హాస్టల్‌కు వెళ్లి చూడ గా అక్కడ హబీబున్నీసా తనకు ఆరోగ్యం బాగా లేదని ఆత్మహత్య చేసుకుంటానని రాసిన సూసైడ్ లేఖ దొరికింది. వారు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు సూసైడ్ నోట్‌ను పరిశీలించి లేఖలో పేర్కొన్న మేరకు పానగల్లు ఉదయ సముద్రం తూము వద్దకు వెళ్లి రాళ్లపై పరిశీలించగా బ్యాగ్, రెండు జతల చెప్పులు, పుస్తకాలు లభ్యమయ్యాయ. పోలీసులు గజ ఈతగాళ్లను పిలిచి రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహాల ఆచూకీ లభ్యం కాలేదు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ గంగారామ్, సీఐ భాషా, ఎస్సై నర్సింహ్ములు, ఫైర్ ఎస్సై శ్యాంసుందర్‌రెడ్డి తదితరులున్నారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థినుల మృతదేహాలు లభ్యం కాకపోవడంతో విద్యార్థినులిద్దరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా లేదా అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

చిత్రాలు.. గల్లంతైన హబీబున్నీసా, శ్రావణి