క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో తలోడి వీఆర్‌వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూర్, జనవరి 31: కుమ్రంభీం జిల్లా కౌటాల మండలం తలోడి వి ఆర్ ఓ లంఛం తీసుకుంటూ ఏసిబి అధికారులకు గురువారం పట్టుబడ్డారు. ఏసిబి డి ఎస్పీ ప్రతాప్, సీఐ లు రవీందర్, ప్రశాంత్‌లు తెలిపిన వివరాల ప్రకారం గురువారం కౌటాల మండలం తలోడి వీఆర్‌ఓ దుర్గయ్య తలోడి గ్రామానికి చెందిన శ్యాం రావు అనే రైతు వద్ద రూ.5 వేలు లంఛం తీసుకుంటుండగా, పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. శ్యాం రావుకు కౌటాల మండలం తలోడి శివారులో ఉన్న రెండు ఎకరాల పొలంను పట్టాదారు పాస్ పుస్తకం, రైతు బంధు పథకంలో చేర్పించుటకు గాను, తలోడి వీఆర్‌ఓ దుర్గయ్య రైతు నుంచి రూ.5 వేలు డిమాండ్ చేయగా, కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు గురువారం వీఆర్‌ఓ దుర్గయ్యకు, శ్యాం రావు రైతు లంచం ఇస్తుండగా, తహసీల్ కార్యాలయంలో వల పన్ని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వీఆర్‌ఓను అరెస్టు చేసి తరలించారు. అధికారుల వెంట సిబ్బంది పోశెట్టి, ఫారూఖ్, సుమన్, అశోక్, దయాకర్, ఉన్నారు.

చిత్రం.. ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్‌ఓ దుర్గయ్య