క్రైమ్/లీగల్

గురుకులంలో విద్యార్థినులపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, ఫిబ్రవరి 1: విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయిని, విద్యార్థినులపై దాడి చేసి అమానుషంగా కొట్టడంతో ఇద్దరు పిల్లలకు తలలు పగిలి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండ వద్ద గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కంప్యూటర్ టీచరుగా పనిచేస్తున్న వెంకాయమ్మ గురువారం మధ్యాహ్నం ఇచ్చిన హోమ్‌వర్క్ సరిగా చేయలేదన్న నెపంతో పరీక్షలు రాసే అట్టతో నిలువుగా తలలపై, చేతులపై కొట్టడంతో ఇద్దరు పిల్లలకు తలలకు గాయాలయి భారీగా రక్తస్రావమైంది. మరో ముగ్గురు పిల్లలకు చేతులు వాచాయి. గాయాలైన విద్యార్థినిలను వెంటనే అద్దంకిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు విచారణచేయాలని అద్దంకి మండల విద్యాశాఖాధికారి విజయకుమార్ ను ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు శుక్రవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. తాత్కాలిక ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న వెంకాయమ్మను తక్షణమే విధులనుండి తొలగించారు. ఆయన మాట్లాడుతూ హోంవర్క్ చేయలేదన్న కారణంతో పిల్లలను తలపై గాయాలయ్యేలా కొట్టడం తప్పని, ఇక మీదట ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.