క్రైమ్/లీగల్

మేమిక్కడ క్షేమమే.. బెంగపెట్టుకోవద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 1: గుజరాత్ రాష్ట్రం వీరావల్ సముద్ర తీరంలో పాకిస్తాన్ కోస్టుగార్డుకి చిక్కి అక్కడి జైల్లో మగ్గిపోతున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాసారు. జిల్లా మత్స్యకారులు కరాచీలోని రండీ జైలులో బందీలుగా ఉన్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 27న బందీలుగా చిక్కిన రాష్ట్రానికి చెందిన 22 మంది మత్స్యకారులు జైల్లోనే మగ్గుతున్నారు. ఇప్పటి వరకూ వీరి క్షేమసమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. రెండు నెలల తర్వాత శుక్రవారం పాకిస్తాన్ నుంచి బందీలుగా ఉన్నవారి నుంచి కుటుంబాలకు ఉత్తరాలు రావడంతో ఆ కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. డి.మత్స్యలేశానికి చెందిన గనగళ్ళ రామారావు, కె.మత్స్యలేశానికి చెందిన శురాడ కిషోర్, శివాజీ దిబ్బలపాలేనికి చెందిన చీకటి గురుమూర్తి, తెప్పలవలసకు చెందిన బర్రి బవిరోడు, బడివానిపేటకు చెందని బడి అప్పన్న తదితరులంతా ఆయా కుటుంబాలకు జైలు నుంచి లేఖలు రావడంతో తీరగ్రామాల్లో ఆనందం కనిపించింది. ఇప్పటికే ఈ కుటుంబాలకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిత్యావసర సరకులు ఉచితంగా అందించింది. పదివేలు చొప్పున్న మొదటి విడతగా పరిహారం అందజేసింది. ఇటీవలే సీఎం రిలీఫ్ ఫండ్‌గా 22 లక్షల రూపాయలు బందీలుగా ఉన్న కుటుంబాలకు అందించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లాతోపాటు తూర్పుగోదావరి జిల్లా పసుపులంక, పూలంక మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు, విజయనగరం జిల్లా భోగాపురం నుంచి తోటపల్లి ముక్కాం, తెప్పలవలస, అస్సాం రాష్ట్రానికి చెందిన ఎస్.సుమంతా ఇలా 22 మంది పాకిస్తాన్ ఖారాగారంలో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ యోగక్షేమాలను తెలుసుకునేందుకు మత్స్యకారులు నిన్నటి వరకూ యత్నించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది.
అయితే, ప్రభుత్వం మాత్రం విడిపించేందుకు విదేశీమంత్రిత్వశాఖ ద్వారా పాకిస్తాన్ రాయబారి కార్యాలయానికి మత్స్యకారుల ఆధార్ వంటి ధ్రువపత్రాలను ఇప్పటికే అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విదేశీ వ్యవహారాల మంత్రి సుస్మాస్వరాజ్‌ను కలిసి రాష్ట్రానికి చెందిన మత్స్యకారులను పాకిస్తాన్ బందీ నుంచి విడిపించాలని ఇప్పటికే పలుమార్లు అభ్యర్థించిన విషయం తెలిసిందే. మత్స్యకారులు కుటుంబాలకు లేఖల్లో క్షేమసమాచారాన్ని తెలియజేస్తునే స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీలపై ఒత్తిడి పెంచి తమను విడిపించేందుకు సాంకేతికపరమైన సమస్యలను పరిష్కరించేలా చూడాలని వేడుకున్నారు.