క్రైమ్/లీగల్

ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, ఫిబ్రవరి 1: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎక్స్‌ప్రెస్ టీవీ వ్యవస్థాపకుడు చిగురుపాటి జయరామ్ గురువారం కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జాతీయ రహదారిపై ఐతవరం సమీపంలో కారులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు హైదరాబాదులో స్థిరపడ్డ చిగురుపాటి జయరాంగా గుర్తించారు. ఈయన కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్‌గా, ఎక్స్‌ప్రెస్ టివి చైర్మన్‌గా, హెమారన్ ఫార్మా కంపెనీ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెరికాలోనూ ఒక బ్యాంక్‌కు డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. జయరాం మృతదేహంపై రక్తపు గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి కారులో పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని నందిగామ డీఎస్‌పీ సుభాష్ చంద్రబోస్, రూరల్ సిఐ, నందిగామ ఇన్స్‌పెక్టర్ పివి రమణ, ఎస్‌ఐలు సిబ్బందితో సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. జయరాం కుటుంబ సభ్యులు ప్రస్తుతం అమెరికాలోని ప్లోరిడాలో నివాసం ఉంటుండగా, అతని తల్లిదండ్రులు విజయవాడ సమీపంలోని కానూరులో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం జయరామ్ హైదరాబాదు నుండి విజయవాడ బయలుదేరినట్లు, ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా కారులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయరాం హత్యకు ఆర్థికపరమైన వివాదాల కారణం అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.