క్రైమ్/లీగల్

అప్పుల బాధతో నేత కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 1: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో నేత కార్మికుడు కొండ్ల శ్రీనివాస్ (40) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక టెక్స్‌టైల్ పార్కులో పవర్‌లూం కార్మికుడిగా పని చేస్తున్న శ్రీనివాస్ మెదడులో ప్రాణాంతక వ్యాధి సంక్రమించడంతో అప్పుల పాలై, చివరికి శుక్రవారం సాయంత్రం తన కాలనీలోని తన ఇంటిలో ఉరి వేసుకుని బలవన్మరణం పాందాడు. దీనిపై చేనేత జౌళి శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
కొండ్ల శ్రీనివాస్ టెక్స్‌టైల్ పార్కులోని బాలాజి టెక్స్‌టైల్స్‌లో పవర్‌లూం కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మెదడుకు సంబంధించిన వ్యాధి రావడంతో చికిత్స కోసం తిరిగి తిరిగి సుమారు ఎనిమిది లక్షల మేరకు అప్పుల పాలైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన మహరాష్టల్రోని అహ్మద్‌నగర్‌లో చికిత్స పొందుతున్నాడు. అప్పులు పెరగడంతో ఇక్కడి ఇందిరమ్మకాలనీలోని ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాడు. ఈ స్థితిలో అప్పుల బాధ, అనారోగ్యం తీవ్రం కావడంతో తన ఇంటిలో చీరతో ఉరి వేసుకుని మృతి చెందాడు. భార్య సవిత (32) బీడీ కార్మికరాలుగా పని చేస్తున్నది. శ్రీనివాస్‌కు భార్య, కూతురు అక్షిత (14), కుమారుడు రోహిత్ (8) ఉన్నారు. తంగళ్ళపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.