క్రైమ్/లీగల్

బీహార్‌లో రైలు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోన్‌పూర్ (బీహార్): బీహార్‌లో రైలు ప్రమాదం జరిగింది. సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. 12487 జోగ్‌బనీ-ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ 11 బోగీలు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కిషన్‌గంజ్ జిల్లాలోని జోగ్‌బనీ వద్ద పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం సోన్‌పూర్ డివిజన్‌లోని మహనార్‌రోడ్‌కు దగ్గరలో ఉంది. ఈ ప్రమాదంలో ఒక జనరల్ కోచ్, ఒక ఏసీ కోచ్, బి 3, ఎస్ 9, ఎస్ 9, ఎస్ 10 స్లీపర్ కోచ్‌లతో పాటు మరో ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 29 మంది తీవ్రంగా, 27 మంది స్వల్పంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని లచ్చా దేవి (66), ఇందిరా దేవి (60), శంషుద్దీన్ ఆలం (26), అన్సర్ ఆలం (19), షైదా ఖటూన్ (40), సుదర్శన్ దాస్ (60)లుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడిన వారిని మజఫర్‌పూర్, పట్నా ఆసుపత్రులకు డాక్టర్లు రిఫర్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. సహాయ చర్యలు వేగంగా జరుగుతున్నాయని, మిగిలిన ప్రయాణికులకు ఆహారం, నీరు అందించామని, ఏక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ను సంఘటనా స్థలానికి పంపామని, ప్రమాదంలో బాగానే ఉన్న 12 కోచ్‌లను 11 కోచ్‌ల రైలుకు కలిపి 500 మంది ప్రయాణికులతో 9.52 గంటలకు గమ్యస్థానానికి బయలుదేరిందని, మరికొంతమందిని పది బస్సులలో హాజిపూర్‌కు పంపామని ఆయన వివరించారు. ప్రమాదానికి ట్రాక్‌లో ఏర్పడినే పగులే కారణం కావచ్చునని అధికారులు భావిస్తున్నారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ లతీఫ్‌ఖాన్‌ను ప్రమాదంపై విచారణను నిర్వహిస్తారు. ఈ సందర్భగా రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. సోన్‌పూర్ 06158221645, హాజిపూర్ 06224272230, బరౌని 06279232222 నెంబర్లను ప్రయాణికులు, వారి బంధువులు సంప్రదించవచ్చునని రైల్వే అధికారులు తెలిపారు.
కాగా, తొలుత ప్రమాదంలో ఏడుగురు మృ చెందినట్టు అదికారులు ప్రకటించారు. మృతదేహాలను వైశాలి జిల్లాలోని ఆసుపత్రికి తరలించగా, ఆ ఆసుపత్రిలో మృతి చెందిన రోగిని కూడా ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిగా పొరపాటుగా భావించి ప్రమాద మృతులు ఏడుగురని ప్రకటించారు. తర్వాత పొరపాటును సవరించి మృతులు ఆరుగురేనని అధికారులు స్పష్టం చేశారు.