క్రైమ్/లీగల్

అత్తింటి వరకట్న వేధిపులపై ఎస్పీకి పిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 4: అదనపుకట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అత్తింటివారు మానసికంగా, శారీరకంగా వేదింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ స్థానిక వన్ వే ట్రాఫిక్ డౌన్ కస్పావీధికి చెందిన నరవ పుష్ప అనే విహిత సోమవారం అనకాపల్లి వచ్చిన ఎస్పీ అట్టాడ బాపూజీని కలిసి పిర్యాదుచేసి వినతిపత్రం అందజేసారు. ఇందుకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి కస్పావీధికి చెందిన పుష్పను విశాఖపట్నం మురళీనగర్‌కు చెందిన నరవ సంతోష్‌తో 2017లో వివాహం అయ్యింది. కొన్ని నెలలు సజావుగా సాగిన వీరికాపురం క్రమేపీ వరకట్నం విషయమై భార్యభర్తలు మధ్య వివాదాలు చోటుచేసుకొని అత్త నరవ వరలక్ష్మి, ఆడపడుచులు ఇతర కుటుంబ సభ్యులు ఏకమై అదనపు కట్నం తీసుకురావాలని వేదించి గృహహింసకు పాల్పుడుతూ ఇబ్బందులకు గురిచేసారని పిర్యాదులో పేర్కోన్నారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 26న పట్టణ మహిళా పోలీస్టేషన్‌లో పిర్యాదు చేసామన్నారు. పిర్యాదు చేసిన సమయంలో ఒంటి నుండా గాయాలతో ఉన్నప్పటికీ కేసు నమోదు చేసినట్లు తమకు రసీదు ఇచ్చి ఇప్పటివరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివాహిత పుష్ప ఎస్పీ ఎదుట మొర పెట్టుకుంది. అత్తింటివారితో దిగువ స్థాయి పోలీసులు లాలూచిపడి వారిపై చర్యలు తీసుకోకుండాఅలాగని పై అధికారులకు తెలియనీయకుండా కాలయాపన చేస్తున్నారని ఆమె పిర్యాదులో పుష్ప పేర్కోంది.దీనిపై స్పందించిన ఎస్పీ పూర్తిస్థాయిలో దర్యాప్తుచేయించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.