క్రైమ్/లీగల్

దొంగ నోట్ల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఫిబ్రవరి 5: నకిలీ నోట్లను తయారుచేసి మార్కెట్‌లో చెలామణి చేస్తున్న దొంగ నోట్ల ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద 31లక్షల 25వేల నకిలీ ఐదు వందలు, రెండువేల నోట్లు, కారు, ప్రింటర్, స్కానర్, ప్రింటింగ్ మెటీరియల్, ఏడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల తెలిపారు. ఎల్బీనగర్, డాక్టర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రధాన నిందితుడు రాకేష్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రకు చెందిన మరో 11 మంది ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా నకిలీ నోట్లను తయారుచేస్తూ మార్కెట్‌లో చెలామణీ చేస్తున్నారు. గతంలో నకిలీ ఎడ్యుకేషన్ పత్రాలు తయారుచేసి జైలు శిక్ష అనుభవించిన రాకేష్ దొంగ నోట్ల తయారీలో ప్రధాన నిందితుడు. డాక్టర్స్ కాలనీలో ఒక ఇల్లును అద్దెకు తీసుకుని నకిలీ రెండువేలు, ఐదు వందల నోట్లను తయారుచేసి మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ బాబా, చాంద్రాయణగుట్టకు చెందిన షకీల్ సహకారంతో మార్కెట్‌లో చెలామణి చేస్తున్నారు. జిల్లాలలో జరుగుతున్న పశువుల సంతల్లో ఈ నోట్లను మార్పిస్తూ ఇప్పటికి నాలుగు లక్షల నోట్లను చెలామణి చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు నకిలీ నోట్లు తయారుచేస్తున్న ఇంటిపై దాడిచేసి ప్రధాన నిందితుడు రాకేష్‌తోపాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సీపీ వెల్లడించారు.