క్రైమ్/లీగల్

120 కిలోల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఫిబ్రవరి 5: నగర టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం ఒక కారును అటకాయించి దానిలోని 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు, గంజాయి, ఇద్దరు నిందితులను కొత్తపేట పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం నర్సీపట్నం నుండి హైదరాబాద్‌కి కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది కొత్తూరు తాడేపల్లి రోడ్డులోని వైవీ రావు ఎస్టేట్ సర్కిల్ వద్ద అటకాయించారు. సోదా చేయగా 120 కిలోల గంజాయి దొరకింది. డ్రైవర్, మరో వ్యక్తి, కారు, సరుకు సహా కొత్తపేట పోలీసులకు అప్పగించారు.