క్రైమ్/లీగల్

అన్ని కోణాల్లో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుపై రెండు రాష్ట్రాల ప్రజల దృష్టి పడింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డి చంపాడని ఏపీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన విషయం విదితమే. జనవరి 30నే జయరామ్‌ను మహిళా యాంకర్ పేరుతో నిందితుడు రాకేష్ రెడ్డి ట్రాప్ చేసి, తన వెంట గన్‌మెన్ లేకుండా ఇంటికి రావాలని జయరామ్‌ను నమ్మించాడు. యాంకర్‌తో రాసలీలలు జరుపొచ్చనే ఆశతో జయరామ్ జూబ్లీహిల్స్‌లోని రాకేష్ ఇంటికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చేరుకున్నాడు. ఇంట్లోకి వచ్చిన జయరామ్‌ని రాకేష్ తాళ్లతో బంధించి, డబ్బులు ఇస్తావా లేదా అంటూ జయరామ్ ఛాతిపై పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశాడు. అంతే కాకుండా దిండుతో ఊపిరి ఆడకుండా చేశాడు. రాకేష్ జయరామ్‌ను బందీగా ఉంచి దాదాపు 12 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో జయరామ్ మృతి చెందాడు. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు రాకేష్ మృతదేహాన్ని రెండు కార్లలో షిప్ట్ చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇది ఇలా ఉండగా జయరామ్ భార్య తనకు తగిన న్యాయం చేయాలంటూ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పాత్రేమీ లేదని కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి విదితమే. జయరామ్ సతీమణి పద్మ శ్రీ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిఖాతో పాటు జయరామ్ సోదరిపై కూడా అనుమానం ఉందని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పద్మశ్రీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి విచారణపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ కేసుపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆంధ్ర పోలీసులకు సంబంధం లేకుండా తెలంగాణ పోలీసులు ఈ కేసుపై పలువురిని విచారించనున్నారు. జయరామ్ కార్ డ్రైవర్‌తో పాటు ప్రతి ఒక్కరిని విచారించే అవకాశాలున్నాయి. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి పలువురు సీనియర్ అధికారులను కూడా విచారణకు సంబంధించి నియమించిన్నట్లు విశ్వసనియ సమాచారం. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ హరిచ్చంద్ర రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. న్యాయ సలహాలు తీసుకుని ఈ కేసులో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.