క్రైమ్/లీగల్

తులసి పంట కేసులో ఉద్యానవన శాఖాధికారి నవీన్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, ఫిబ్రవరి 5: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ రైతులను నమ్మించి నట్టేట ముంచిన తులసి పంట కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసిన తదుపరి, మంగళవారంనాడు అద్దంకి ఉద్యానవనశాఖాధికారి నవీన్‌ను అద్దంకి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా, కోర్టు రిమాండ్ విధించింది. అద్దంకి నియోజకవర్గంలో 1200 ఎకరాల్లో తులసి పంటను సాగుచేయించి, పంటను తామేకొంటామని రైతులను నమ్మించి, పంట చేతికివచ్చిన తరుపరి ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరార్ కావడంతో ఎట్టకేలకు వారంరోజులక్రితం పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. రైతులనుండి మరికొన్ని ఫిర్యాదు నమోదైన నేపధ్యంలో మంగళవారం నాడు కోర్టునుండి ప్రత్యేక అనుమతులు తీసుకొని రిమాండ్‌లో ఉన్న నిందితుడు శ్రీనివాస్‌ను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం తులసి పంట కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌కు అద్దంకి ఉద్యానవనశాఖాధికారి నవీన్ సహకరించి, రైతులను మోసం చేశాడన్న రైతులు పెట్టిన కేసును ఆధారంగా చేసుకున్న పోలీసులు నవీన్‌ను కూడా అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. తులసి పంట కేసులో రైతులకు సలహాలు సూచనలిచ్చినంత మాత్రాన ఉద్యానవనశాఖాధికారి నవీన్‌ను అరెస్టు చేయడం అన్యాయమని ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఉద్యానవనశాఖాధికారులు మంగళవారం సాయంత్రం స్ధానిక బంగ్లారోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. పోలీసులు అక్రమంగా నవీన్‌ను అరెస్టు చేశారని, నవీన్‌ను జరిగిన అన్యాయంపై తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.