క్రైమ్/లీగల్

జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, ఫిబ్రవరి 6: ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత నెల 31న కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఐతవరం వద్ద జయరాం మృతదేహం కారులో లభించిన విషయం తెలిసిందే. బుధవారం హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు హైదరాబాదులో జయరాంను హత్య చేసి మృతదేహాన్ని ఈప్రాంతంలో వదిలి పరారైనట్లు తెలిపారు. కాగా ఘటన జరిగింది తెలంగాణ పరిధిలో కావడంతో పాటు హైదరాబాదు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హతుడు జయరాం సతీమణి మంగళవారం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాదు సిటీ పోలీస్‌లకు ఈ కేసును బదిలీ చేస్తున్నట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రకటించారు. ఈ అంశంపై ఏపీ పోలీసులు న్యాయనిపుణుల సలహాలు తీసుకుని నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాదు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జయరాం భార్య పద్మశ్రీ మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ హత్య వెనుక జయరాం మేనకోడలు మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉందనేది ఆమె ఆరోపణ. ఆంధ్ర పోలీసులు శిఖాచౌదరిపై కేసు నమోదు చేయకపోవడంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. కాగా జయరాం హత్య కేసులో నందిగామ పోలీసులు అరెస్టు చేసిన రాజేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను బుధవారం కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలిచ్చారు. దీంతో నిందితులను నందిగామ సబ్ జైలుకు తరలించారు.