క్రైమ్/లీగల్

గుట్కా అక్రమ రవాణా: 10 మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 6: భారీ స్థాయిలో నిషేధిత గుట్టాను తరలిస్తున్న 10 మంది నిందితులతో పాటు రూ.24 లక్షల గుట్కాను దుందిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను షాపూర్‌నగర్‌లోని బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజా, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ రావు, దుందిగల్ సీఐ శంకరయ్య వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన ఎండీ ఇక్రాముద్దీన్(45), చందానగర్, పాపిరెడ్డి కాలనీకి చెందిన పాండు మనె్న(33), మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌కు చెందిన సబావత్ సూర్యం(28), శేరిలింగం పల్లి, తారానగర్ నివాసి నమసమ్‌గారి జితేంద్ర(26), కర్ణాటక బీదర్‌కు చెందిన బండప్ప(24), ఓల్డ్ మల్లెపల్లికి చెందిన కాంబ్లే కందేరామ్(50), ఎంపీ షఫీ(21), మల్లుపల్లి, అఫ్జల్ సాగర్‌కు చెందిన ఎండీ అజీమ్(29), నాంపల్లి మంగల్‌హట్ నివాసి షేక్ ముస్తప్ప(34), నాంపల్లి యూసుఫ్ బాబా దర్గాకు చెందిన షేక్ సమీర్(22) డ్రైవర్ కమ్ ఓనర్‌గా పనిచేస్తుంటారు. పదిమంది కలిసి బీదర్ నుంచి హైదరాబాద్‌కు ఐదు వాహనాలలో నిషేదిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్‌ఓటీ, దుందిగల్ పోలీసులు సంయుక్తంగా దుందిగల్ ఓఆర్‌ఆర్ వద్ద పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీదర్ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన గుట్కాను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుంటారు. పది మంది నిందితులను రిమాండ్‌కు తరలించి వారి నుంచి రూ.24 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా, ఐదు వాహనాలు, 11 సెల్‌ఫోన్‌లు, రూ.56750 నగదును స్వాధీనం చేసుకున్నారు.