క్రైమ్/లీగల్

యూపీలో బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దియోరియా (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 6: ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక బాలికను ముగ్గురు యువకులు బలవంతంగా ఎత్తుకొనిపోయి అత్యాచారం జరిపారు. సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న ఈ బాలికను యువకులు ఎత్తుకెళ్లి దగ్గరలోని పంట చేలలోకి తీసుకెళ్లారు. తరువాత అక్కడ ఆమెను రేప్ చేశారని ఎస్‌పీ ఎ.కోలంచి బుధవారం తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వివరించారు.