క్రైమ్/లీగల్

గోవిందుని కిరీటాల మాయం కేసు..పోలీసుల అదుపులో పాత నేరస్థుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 6: శ్రీ గోవింద రాజ స్వామివారి ఆలయంలో శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామివారి ఉపాలయంలోని ఉత్సవమూర్తుల మూడు కిరీటాలను చోరీ చేసిన తమిళనాడుకు చెందిన ముత్తయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతనికి సహకరించిన ఆటో డ్రైవర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కిరీటాల చోరీ కేసుకు సంబంధించి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో ఆరు పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. ఈక్రమంలో ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లో ఓ యువకుడిని గుర్తించి మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని బుధవారం చెన్నయ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సీసీ టీవీ ఫుటేజ్‌లో ఉన్న వ్యక్తి పేరు ముత్తయ్యని విచారణలో తేలింది.ముత్తయ్య ఆలయాల్లో ఆభరణాలు చోరీ చేయడం వృత్తిగా సాగిస్తున్నట్లు తెలిసింది. పలు ఆలయాల్లో జరిగిన చోరీల్లో ముత్తయ్య నిందితుడిగా భావిస్తున్నారు. కాగా కిరీటాలు అపహరించిన అనంతరం ముత్త్యకు స్థానికంగా ఒక ఆటో డ్రైవర్ సహకరించినట్లు తెలుసుకున్న పోలీసులు అతనిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.