క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, ఫిబ్రవరి 7 : మండల పరిధిలోని కోడిపల్లి ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి అరుణ (21) ఇంట్లో పైకప్పునకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లేపాక్షి పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక ప్రాంతంలోని వాటం కొత్తపల్లి గ్రామానికి చెందిన అరుణ కోడిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే బుధవారం రాత్రి భర్త చంద్రశేఖర్‌కు భోజనం వడ్డించి అరుణ ఇంట్లోని గదిలోకి వెళ్లింది. ఉదయం ఎంత సేపటికీ గది తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి చూడగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపించింది. వెంటనే పోలీసులకు విషయం తెలిపారు. ఏఎస్సై సుబ్బరాం నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.