క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 10: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వాల్‌లో నివాసముండే సూరకంటి విజయభాస్కర్ (50) ప్రభుత్వ ఉద్యోగి. ఇతని కుమార్తె సూరకంటి సహానా (16) బాచుపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. ఈ నెల 9న విజయభాస్కర్ సహానాను శ్రీ చైతన్య కాలేజీ వద్ద డ్రాప్ చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్‌కు ఫోన్ చేసి సహానా కాలేజీకి రాలేదని సమాచారం అందించాడు. దీంతో విజయభాస్కర్ చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్లలో ఆరాతీయగా ఆచూకీ దొరకలేదు. విజయభాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.