క్రైమ్/లీగల్

మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఫిబ్రవరి 10: మనస్థాపం చెంది పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూరసాని మాలపల్లిలో చోటు చేసుకుందని కూచిపూడి ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు ఆదివారం తెలిపారు. మొవ్వ మండలం సూరసాని మాలపల్లికి చెందిన ము వ్వల లక్ష్మయ్య కుమారుడు జానీ (17) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ యువకుడు పామర్రు ప్రేమసాయి సెల్‌ఫోన్ దుకాణంలో సెల్ ఫోన్ దొంగిలించినట్లు యజమాని వి సాంబిరెడ్డి ఆరోపించి దుర్బాషలాడి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నాడు. అదేమని అడిగితే సీసీ కెమెరా ఫుటేజి ద్వారా జానీ హస్థలాగం ప్రదర్శించాడని దుర్భాషలాడాడు. దీంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు శనివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువు పొలానికి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత తలుపులు వేసి ఉండటంతో ఎంత సేపు తలుపు కొట్టినా తియ్యకపోవటంతో అనుమానం వచ్చి తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూడగా జానీ మృతి చెందినట్లు గుర్తించి గొల్లుమన్నది. ఈ సమాచారం తెలుసుకున్న కూచిపూడి పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.