క్రైమ్/లీగల్

బీజేపీ నేత ముకుల్ రాయ్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 10: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్యకేసులో బీజేపీ నేత ముకుల్ రాయ్ సహా నలుగురిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ముకుల్ రాయ్ గతంలో టీఎంసీ తరఫున ఎంపీగా పనిచేసి, సీఎం మమతా బెనర్జీతో వచ్చిన విభేదాల వల్ల బీజీపీలో చేరారు. బిశ్వాస్ హత్య వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని, విచారణ తర్వాత నిందితులను కఠినంగా శిక్షించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ శనివారం డిమాండ్ చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కమలం పార్టీ రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కృష్ణగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిశ్వాస్ (41)ను పూల్‌బరి ప్రాంతంలో సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు అతి దగ్గరగా కాల్చారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు.