క్రైమ్/లీగల్

చిట్‌ఫండ్ స్కాంపై దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, ఫిబ్రవరి 10: శారద చిట్‌ఫండ్ స్కాంలో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. వివాదస్పద కోల్‌కొతా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్, టీఎంసీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌ను సీబీఐ పోలీసులు ఇక్కడ రెండవ రోజు విచారించారు. ఈ సందర్భంగా అనేక కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. శనివారం దాదాపు 9 గంటల సేపు రాజీవ్ కుమార్‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ స్కాంపై రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ బృందం గతంలో దర్యాప్తు చేసిన విషయం విదితమే. ఈ సిట్‌ను సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేశారు. సీబీఐ ఆఫీసుకు వంద మీటర్ల దూరంలో ఉన్న సరస్వతి దేవాలయానికి టీఎంసీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ వెళ్లి సందర్శించుకున్నారు. తనకు ఈ స్కాంతో సంబంధం లేదని, హాజరు కావాలని సమన్లు ఇచ్చారు. చట్టాన్ని గౌరవించి వచ్చానని ఆయన చెప్పారు. ఘోష్‌ను 2013లో పోలీసులు ఈ స్కాంలో అరెస్టు చేశారు. 2016 నుంచి బెయిల్‌పై ఉన్నారు. ఘోష్, రాజీవ్ కుమార్‌ను ఒకే చోట కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉన్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. బెనర్జీకి గతంలో కుడి భుజంగా ఉన్న, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ముకుల్ రాయ్‌కి ఈ స్కాంతో ప్రమేయం ఉన్నట్లు మాజీ ఎంపీ చెప్పారు ఈ స్కాంలో 12 మంది నిందితులు ఉన్నారు. పోలీసు కమిషనర్‌ను సీబీఐ అధికారులు కోల్‌కొతాకు రావడం వివాదస్పదమైన సంగతివిదితమే. ఈ కేసులో సీఎం మమతా బెనర్జీ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు మద్దతుగా ధర్నా చేశారు. రాజీవ్ కుమార్ వద్ద ఈ స్కాంకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నట్లు భావిస్తున్నట్లు సీబీఐ తెలిపింది.